మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా త్వరలోనే ఫైనల్ కానుంది. ఇప్పటికీ ఇద్దరి పేర్లతో లిస్ట్ తయారు అయ్యింది. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందని భావించిన పాల్వాయి స్రవంతికి అందులో చోటు దక్కలేదు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారనుకున్నపార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి నిరాశ ఎదురైంది. ఆమె పేరును అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ తొలగించింది. ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి ఇద్దరి పేర్లను హైకమాండ్ గురువారం షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో పల్లె రవి, సి.కృష్ణారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిద్దరు జర్నలిస్టుగా పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చారు.
శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించండి.. ముస్లింలకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు
టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డిల మధ్య నిన్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఐదుగురు పోటీదారుల నుంచి పల్లె రవి, కృష్ణారెడ్డిలు ఇందులో ఎంపికైనట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారని ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది.
బీజేపీకి దిమ్మ తిరిగేలా జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలకపాత్ర.. : సీఎం కేసీఆర్
కాగా.. ఈ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ అయిన టీజేఎస్ (తెలంగాణ జన సమితి) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు, పల్లె రవి సోదరుడు అయిన పల్లె వినోద్ ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది.
జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు
అయితే రేవంత్ రెడ్డికి వీరాభిమాని అయిన కృష్ణారెడ్డి పేరును ఖరారు చేస్తే ఆయన రాజకీయ అనుభవం చర్చనీయాంశం కానుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో ఓడిపోతే ఆయన విధేయతను మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
