చండూరులో ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్ధం: కాంగ్రెస్ ఆందోళన

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని  దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

Congress protest after election campaign material fire in Chandur

చండూరు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం నాడు   ప్రచార సామాగ్రి దగ్దమైంది.  గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే  ప్రచార సామాగ్రిని దగ్దం చేశారని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. 

ఈ విషయమై  చండూరులో కాంగ్రెస్ పార్టీకార్యకర్తలు ఆందోళనకు దిగాయి. మునుగోడు ఉప ఎన్నికలను పురస్కరించుకొని  చండూరులో ఎన్నికల కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే ప్రారంభించింది.ఎన్నికల ప్రచార సామాగ్రిని ఈ కార్యాలయంలో ఉంచారు. అయితే ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దం కావడంతో  కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ  ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని చండూరులో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఇవాళ చండూరులో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ప్రచార సామాగ్రిని దగ్దం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి  వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు.  గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 

ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కాంగ్రెస్  పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాచేశారు. అదే నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తున్నారు.  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ  నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన  ఎన్నికల్లో ఆరు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఐదు దఫాలు సీపీఐ అభ్యర్ధులు గెలుపొందారు. ఒక్క సారి టీఆర్ఎస్ విజయం సాధించింది. 

also read:ఆ ఎనిమిది గుర్తులు కేటాయించొద్దు: ఈసీని కోరిన టీఆర్ఎస్

ఈ ఎన్నికల్లోలెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతను ప్రకటించాయి.  ఈ నియోజకవర్గంలో లెప్ట్ పార్టీలకు మంచి పట్టుంది.  లెఫ్ట్ పార్టీలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు కోరాయి. అయితే లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతిచ్చాయి. లెఫ్ట్ పార్టీల క్షేత్రస్థాయి క్యాడర్ తమకు అనుకూలంగానే ఓటు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విశ్వాసంతో ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios