తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కొడంగల్ బయలుదేరారు.

అక్కడ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించి అనంతరం ఖమ్మంలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో కొన్ని రోడ్ షోలలో పాల్గొని ప్రజాకూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తారు.