తెలంగాణలో త్వరలో రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయాలని  తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రైతుల సమస్యలపై తమ పార్టీ వైఖరిని ఈ సభ ద్వారా తెలపనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో Rahul Gandhi తో సభ ఏర్పాటు చేయాలని Congress పార్టీ ప్లాన్ చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై BJP , TRS వైఖరిని ఎండగడుతూ ఉద్యమం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ ఉద్యమం ముగింపును పురస్కరించుకొని రాహుల్ తో సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన Paddy ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. వరి ధాన్యం అంశాన్ని తీసుకొని KCRసర్కార్ రాజకీయం చేస్తుందని బీజేపీ విమర్శలు చేస్తుంది.

వరి ధాన్యం అంశంపై తెలంగాణ రైతులను బీజేపీ, టీఆర్ఎస్ లు బలి పశువులుగా మారుస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై 40 రోజుల పాటు ఉద్యమం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఉద్యమ కార్యాచరణను సిద్దం చేయనున్నారు. కనీసం 40 రోజుల పాటు ఉద్యమం ఉండేలా ప్లాన్ చేయాలనిTPCCనాయకత్వం భావిస్తుంది.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నాయనే విషయమై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉండనుంది. రాజకీయ లబ్ది కోసం రైతులను ఈ రెండు పార్టీలు ఎలా ఉపయోగించుకొంటున్నాయో వివరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.

అయితే రైతు విధానాలతో పాటు వరి ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ వైఖరిని తెలంగాణప ప్రజలకు వివరించాలని టీపీసీసీ భావిస్తుంది. ఈ మేరకు రాహుల్ గాంధీతో ఈ విషయాలను చెప్పించాలని కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంంలో సభను ఏర్పాటు చేసి రైతు విధానాలపై తమ వైఖరిని కాంగ్రెస్ స్పష్టం చేయనుంది. 

టీపీసీసీ చీఫ్ గా Revanth Reddy బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రాహుల్ సభ జరగలేదు. కొంత కాలంగా రాహుల్ సభ నిర్వహణ కోసం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినా అనేక కారణాలతో సాధ్యం కాలేదు. ఈ దఫా రాహుల్ తో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఉగాది తర్వాత తమ ఆందోళనలను టీఆర్ఎస్ మరింత ఉధృతం చేయనుంది. టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ తరుణంలో ఈ రెండు పార్టీల వైఖరిపై ప్రజలకు వివరించేందుకు గాను కాంగ్రెస్ నేతలు ఉద్యమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నేతల మధ్య సమన్వయం లేదు సీనియర్లు కొందరు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. అయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రైతు ఉద్యమంపై పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.