గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే 29 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మరో 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది.

ఇప్పటికే వామపక్ష పార్టీలు తాము పోటీ చేయబోయే స్థానాల్లో పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా 105 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

రెండో జాబితా:

1. ముసారాం బాగ్ - లక్ష్మీ
2. ఓల్డ్ మలక్‌పేట - వీరమణి
3. ఫతేర్‌ఘాటీ -ఖాసిం
4. ఐఎస్ సదన్ -కీర్తి మంజుల
5. సంతోష్ నగర్ - షరీఫ్
6. పురానాపూల్ -అక్బర్
7. లలిత్ బాగ్ - అబ్ధుల్ ఇర్ఫాన్
8. రియాసత్ నగర్ - ముస్తఫాఖాద్రి
9. కంచన్ బాగ్ - అమీనా సబా
10. బార్కస్ -బేగం షెహనాజ్
11. చాంద్రాయణ గుట్ట -షేక్ అఫ్జల్
12. నవాబ్ సాహెబ్ కుంట -మీరాజ్ బేగం
13. శాలిబండ -తిరుపతి
14. కిషన్ బాగ్ -అసద్ అలీ
15. బేగం బజార్ -పురుషోత్తం
16. దత్తాత్రేయ నగర్ -నారాయణ