హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్, బీజేపీలో పార్టీల్లోకి జంప్ అయిపోవడంతో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. 

తాజాగా మాజీమంత్రి, దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారంటూ వార్తలు పొలిటికల్ సర్కిల్ లో హల్ చల్ చేస్తున్నాయి.  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాషాయి కండువా కప్పుకునేందుకు విష్ణువర్థన్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేతలతో విష్ణు చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా విష్ణువర్థన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తుంటే విష్ణు గానీ ఆయన సన్నిహితులు గానీ ఎవరూ స్పందించకపోవడం విశేషం.