Asianet News TeluguAsianet News Telugu

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇంద్రవెల్లి బిడ్డలకు న్యాయం చేస్తాం: రేవంత్ రెడ్డి

40 ఏళ్లు అయినా ఇంద్రవెల్లి బాధితులకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు.

congress mp revanth reddy slams kcr govt over indravelli incident victims ksp
Author
Hyderabad, First Published Apr 20, 2021, 4:01 PM IST

40 ఏళ్లు అయినా ఇంద్రవెల్లి బాధితులకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ స్వరాష్ట్రంలోనూ ఇంద్రవెల్లి బాధితులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల ఆర్థిక సహాయం అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కలిపించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు అండగా  లేకపోతే మరో ఇంద్రవెల్లి సంఘటనకు దారితీయొచ్చని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనుకుంటే ప్రభుత్వాలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంద్రవెల్లిని మరో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు.

పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీడీఏలను నిర్వీర్యం చేస్తున్నారని .. అడవి బిడ్డలను మైదాన ప్రాంతాలకు తరలించడం సరికాదని వ్యాఖ్యానించారు. వారు ఉన్న చోటనే జీవించేలా వారికి వసతులు కలిపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

రాబోయే రోజుల్లో రాజ్యం తమ చేతికి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ స్పందించకుంటే ఇంద్రవెల్లి బాధితులకు, అడవి బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios