హైదరాబాద్: దుబ్బాక ఫలితం వన్ టైమ్ వండర్ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ  రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను లేకుండా చేయడం ఎవరి తరం కాదని ఆయన చెప్పారు.సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపునకు టీఆర్ఎస్ సహకరించిందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ అనుబంధం పాలు నీళ్ల వంటిందన్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం  కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ కూడ దక్కకపోవడం ఆ పార్టీ క్యాడర్ లో నిరాశను నింపింది.దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని బిల్లుల విషయంలో టీఆర్ఎస్  మద్దతు ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గతంలో పలుమార్లు గుర్తు చ ేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉందని ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.