Asianet News TeluguAsianet News Telugu

దేవరయంజాల్‌లో కేటీఆర్‌, మల్లారెడ్డికి భూములు: సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్

హైద్రాబాద్‌కి సమీపంలోని దేవరయాంజిల్ లో రామాలయ భూముల్లో  కేటీఆర్‌కు కూడా భూములున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ భూముల విషయమై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Congress MP Revanth Reddy demands CBI probe on Devarayamjanal lands lns
Author
Hyderabad, First Published May 3, 2021, 5:50 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్‌కి సమీపంలోని దేవరయాంజిల్ లో రామాలయ భూముల్లో  కేటీఆర్‌కు కూడా భూములున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ భూముల విషయమై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం నాడు  ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కేటీఆర్ పేరున ఉన్న సేల్ డీడ్‌ను రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఈ గ్రామంలో దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ నేతలకు భూములున్నాయన్నారు. ఆన్‌లైన్ లో దేవరయంజాల్ లో భూములు లేవన్నారు. సర్వే నెంబర్ 658లోని భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకొన్నారని  ఆయన  ఆరోపించారు. ఏడు ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌజ్ ను కట్టుకొన్నారన్నారు. రామాలయానికి చెందిన 1553 ఎకరాల్లో కేటీఆర్ కి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావుకి  భూమి ఉందన్నారు. 

ఈ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూలగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్ కు కూడ వాటా ఉందన్నారు. 1925 నుండి 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు భూమిని ఎవరు అమ్మిందో బయటపెట్టాలని ఆయన కోరారు. ఆన్‌లైన్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవాలయ భూములు ఎందుకు మాయం అయ్యాయని ఆయన ప్రశ్నించారు. ధరణిని అడ్డుపెట్టుకొని సర్వే నెంబర్లను గోల్‌మాల్ చేశారన్నారు.

ఈ విషయమై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.అయితే కరోనా నేపథ్యంలో తాను ఢిల్లీకి వెళ్లడానికి కొంత ఇబ్బందులున్నాయన్నారు. అయితే అమిత్ షా ను కలవడానికి ముందే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు రేవంత్ రెడ్డి.దేవరయంజాల్ భూముల లావాదేవీలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ గ్రామంలో దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ నేతలకు కూడా భూములున్నాయన్నారు. తప్పుడు పత్రాలతో  కొందరు నేతలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్నారని ఆయన తెలిపారు. ఈ విచారణ పూర్తయ్యేవరకు కేటీఆర్ ను, మల్లారెడ్డిని కూడ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రజాసంఘాలు, పార్టీలు, సంఘాలతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios