ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ను కలిసిన రేవంత్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజన హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వాలని తాను కోదండరామ్‌ను కోరానని ఈ విజయంలో టీజేఎస్ పాత్ర కూడా కీలకమన్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని కోదండరామ్‌ తనకు సూచించారని... సామాజిక మాధ్యమాల్లో తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రోఫెసర్ కోదండరామ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూడా మేం కలుసుకున్నాం.. మేం పోటీ చేసిన స్థానాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా మద్ధతు ఇవ్వాలని అనుకున్నామన్నారు.

రేవంత్ గెలుపు తమకు సంతృప్తినిచ్చిందన్నారు. ప్రశ్నించే వ్యక్తి ఒకరు ఉండాలనే ఆలోచనలతో ప్రజలు ఓటు వేశారని స్పష్టం తెలుస్తోందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.