టీపీసీసీకి చెందిన సీనియర్ నేతలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అపాయింటెమెంట్లు దొరకడం లేదంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.
ఏఐసీసీ (aicc) మాజీ చీఫ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) . పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌తో మాట్లాడారు. అపాయింట్‌మెంట్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని రాహుల్‌కు వివరించారు కోమటిరెడ్డి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాహుల్ . ఈ చర్చలో భాగంగా సోనియా , రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్లు, రాష్ట్రంలో సీనియర్ నేతలకు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి.
అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీగా రైతుల పక్షాన పోరాడేందుకు ముందున్నామని చెప్పారు. రైతుల కోసం కేంద్రంతో పోరాడదామని టీఆర్ఎస్‌కి సూచించారు కోమటిరెడ్డి. రైతుల కోసం రాజకీయాలు పక్కనబెడదామని ఆయన పేర్కొన్నారు. మీరు బీజేపీకి బీటీమ్‌గా వుండొద్దని.. నిజమైన ప్రేమ వుంటే ధాన్యం మీరే కొనుగోలు చేయవచ్చని కోమటిరెడ్డి అన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్‌గడ్‌లో రూ. 1960 కాకుండా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు.
అంతకుముందు మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి Rahul Gandhi స్పందించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలోని Farmers తరపున పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే తెలుగులో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో BJP,TRS ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రైతలు శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
అటు వరి ధాన్యం కొనుగోలు చేయాలని Congress పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్దమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిర్వహించిన ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సోమవారం నాడు తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుధీర్ఘంగా సమావేశమైంది. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. సీనియర్ నేతలు ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. అంతేకాదు వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు.
