హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంపీలు ఎంపీ రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యే ఈ  రేసులో ప్రధాన పోటీదారులుగా వున్నట్లు... వీరిలో ఎవరో ఒకరిని టిపిసిసి పదవి దక్కనుందని ఇప్పటివరకు ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా ఈ రేసులోకి వచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

పీసీసీ పదవిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా జీవన్ రెడ్డికి పిసిసి పదవి ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఈ విషయంపై స్పందించారు.

read more  పీసీసీ పదవి రేసులో జీవన్ రెడ్డి.. తరలివస్తున్న కార్యకర్తలు

నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్నానని, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా పనిచేస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. అయితే టిపిసిసి అధ్యక్షుడిగా తనను  నియమించినట్లు అధిష్టానం నుండి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. పార్టీపరంగానే కాదు వ్యక్తిగతంగానూ తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. 

ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడి ఎంపికకోసం అధిష్టానం అభిప్రాయసేకరణ చేపట్టిందని... తాను కూడా అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేశానన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పిసిసి అధ్యక్షుడి ఎంపికక వుంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.