మునుగోడులో గెలిస్తే 2023లో మాదే అధికారం: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడులో తమ పార్టీ  అభ్యర్ధి గెలుస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Congress MLC Jeevan Reddy Key Comments On Munugode By Poll

హైదరాబాద్:Munugode  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో Congress పార్టీ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో Telangana లో అధికారాన్ని కైవసం చేసుకొంటామని ఎమ్మెల్సీ Jeevan Reddy చెప్పారు. 

సోమవారం నాడు  Hyderabad లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలు తమకు సెమీ ఫైనల్ వంటివన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు  కాదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ పనితీరు ఇప్పటివరకు సంతృప్తిగానే ఉందన్నారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకుంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

 కాంగ్రెస్ పార్టీ గోవు లాంటిదని, బీజేపీ పులి అని Komatireddy Rajagopal Reddy వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పులిపై రాజగోపాల్ రెడ్డి స్వారీ  చేసేందుకు బీజేపీలోకి వెళ్లారన్నారు.. పులిపై స్వారీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికైన ప్రమాదమేనని ఆయన అభిప్రాయపడ్డారు.  KCR  పై పోరాటం కోసం బీజేపీలో చేరుతున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం పోరాటం చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై పోరాటం చేసే అవకాశాన్ని వదులుకొని ఎన్నికలకు వెళ్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు.

మునుగోడు ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేశారు. ఇవాళ స్పీకర్  Pocharam Srinivasa Reddyని కలిసి రాజీనామా పత్రం అందించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. మునుగోడు అసెంబ్లీ స్థానం  ఖాళీగా ఉందని కూడా స్పీకర్  కార్యాలయం ఎన్నికల సంఘానికి కూడా సమాచారం పంపింది.

ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. చౌటుప్పల్ లో ఏర్పాటు చేసే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.  బీజేపీలో చేరే విషయమై అమిత్ షాతో ఆయన చర్చించారు. న్యూఢిల్లీలో కంటే తన నియోజకవర్గంలో సభను నిర్వహించి ఆ సభలో బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారు. ఈ విషయాన్ని అమిత్ షా వద్ద ప్రస్తావించారు.ఈ నెల 21న జరిగే బహిరంగ సభకు కూడా అమిత్ షా కూడా వచ్చేందుకు అంగీకారం తెలిపారు.

also read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. లేఖ అందజేసిన కొన్ని నిమిషాల్లోనే..

ఇదిలా ఉంటే ఈ నెల 5వ తేదీన చండూరులో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది.ఈ సభలో టీపీసీసీ చీప్ Revanth Reddy సహా ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సభకు భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy హాజరు కాలేదు. తనకు సమాచారం లేకుండా ఈ సఃభను ఏర్పాటు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేసే సమయంలో తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios