Asianet News TeluguAsianet News Telugu

ఈటలను దోషిగా చూపేందుకే అసైన్డ్ భూముల విచారణ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను  దోషిగా చూపేందుకే అసైన్డ్ భూములపై విచారణను ప్రభుత్వం  చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 
 

Congress MLC Jeevan Reddy comments on KCR over  Etela Rajender issue ln
Author
Hyderabad, First Published May 4, 2021, 2:54 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను  దోషిగా చూపేందుకే అసైన్డ్ భూములపై విచారణను ప్రభుత్వం  చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దేవరయంజాల్ భూములు కొల్లగొట్టిన వారిలో అంతా టీఆర్ఎస్ నేతలే ఉన్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. . అసైన్డ్ భూముల అన్యాక్రాంతం అయిన వాటిని అన్ని వెలికి తీయాలన్నారు. అసైన్డ్ వర్గాలు నిరుపేదలు కావడంతో భూములు నిలబెట్టుకోలేకపోయారని జీవన్‌రెడ్డి చెప్పారు. 2018లో తీసుకొచ్చిన నూతన పట్టాదారు విధానంతో అసైన్డ్ భూముల మార్పిడి చేశారని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.

అసైన్డ్ భూముల వ్యవహారంపై ఒక కమిటీ వేస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క అడుగు పడట్లేదన్నారు. అన్యాక్రాంతం అయిన అసైన్డ్ భూములను గుర్తించి నిజమైన పట్టాదారుకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని దేవాలయ భూములన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అన్ని అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios