హైదరాబాద్: సీఎల్పీ నేత ఎన్నికను ఈ నెల 16వ తేదీన  నిర్వహించనున్నారు. సీఎల్పీ నేత ఎన్నిక నిర్వహించేందుకు గాను పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్‌కు రానున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7 వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను మాత్రమే కైవసం చేసుకొంది.సీఎల్పీ నేతను ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  సీఎల్పీ నేతను ఎన్నుకొంటారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య సీఎల్పీ పదవి కోసం పోటీ ఉందని ప్రచారం సాగుతోంది.వీరిద్దరితో పాటు మరికొందరు నేతలు కూడ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. గండ్ర వెంకటరమణరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డిలు  పోటీ పడుతున్నారు. 

ఈ దఫా తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టిన వారు ఆరుగురు ఉన్నారు. ఎనిమిది మంది రెండు కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.ఐదురుగు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.

అయితే రానున్న ఐదేళ్ల పాటు అసెంబ్లీలో పార్టీని సమర్ధవంతంగా నడిపే నేతలు అవసరమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే సీఎల్పీ పదవి కోసం కొందరు ఆశతో కూడ ఉన్నారు. అయితే ఈ పదవి దక్కకపోతే పార్టీని కూడ వీడే ఆలోచన కూడ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.