Asianet News TeluguAsianet News Telugu

మంత్రి జూపల్లికి ఆగస్టు 21 డెడ్ లైన్ విధించిన ‘బచ్చా’

  • పాలమూరు నీటిపారుదల ప్రాజక్టులపై చర్చకు మంత్రికి సవాల్ విసిరిన వంశీ
  • నేను బచ్చగాడినే, చర్చకు తలపడేందుకు జంకుతున్నావెందుకు?
  • హైదరాాబాద్ లోఉన్నా, ఎపుడు పిల్చినా, ఎక్కడకు రమ్మన్నా వస్తా
  • ఆగస్టు 21 డెడ్ లైన్
congress mla vamsi dares minister jupalli for a debata palamuru dindi project

‘ మీరంటున్నట్లు నేను రాజ‌కీయాల‌లో బ‌చ్చానే నాకు కుట్ర‌లు చేయ‌డం, పార్టీలు ఫిరాయించ‌డం, మాట‌లు మార్చ‌డం, ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చ‌కుండా ఉండ‌డం, అబ‌ద్దాలు చెప్ప‌డం లాంటివి నాకు రావు,’ అని కల్వకుర్తి ఎమ్మెల్యే డాక్టర్ వంశీ చంద్ రెడ్డి ఒప్పుకున్నారు.

టిఆర్ ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు,టిఆర్ఎస్ నేతలు తనని బచ్చా అనటం మీద వంశీ ఘాటుగా స్పందించారు.అయితే, ఈ బచ్చాతో   పాలమూరు జిల్లా నీటిపారుదల పనులపై చర్చకు రావడానికి భయమెందుకు అని వంశీ టిఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావునుప్రశ్నించారు.

‘ద‌మ్ముంటే, పాల‌మూరు జిల్లాపైన మీరే  చేసినట్లు చెబుతున్న అభివృద్ది ప‌నుల‌పైన బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలి.  స‌వాల్ చేస్తే  స్పందించే దమ్ము జూపల్లికి లేదా.   సాగునీటి ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న లేని నాయ‌కుల‌తో అర్థం ప‌ర్థం లేని మాట‌లు మాట్లాడించ‌డం ఆయ‌న దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌నం,’ అని  వంశీచంద‌ర్ రెడ్డి విరుచుప‌డ్డారు.  హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘ నేను నేటి నుంచి 21వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉంటాను.  ఎక్క‌డ చ‌ర్చ‌కైనా సిద్దంగా ఉన్నా. రా,’ అని జూపల్లి కి సవాల్ విసిరారు.

 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని టిఆర్ ఎస్ నాయ‌కులు అన‌డం మిలినీయం జోక్ అని వంశీ అన్నారు.  తాము ఎందుకు రాజీనామా చేయాలో టిఆర్ ఎస్ చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.

‘మేము పార్టీలు ఫిరాయించామా ? అబ‌ద్దాలు చెప్పామా ? ప‌్ర‌జ‌ల‌కు ద్రోహం చేశామా,’ చెప్పండి అని అడిగారు.

 టిఆర్ ఎస్ కు  ప్ర‌జ‌ల‌లో వ్య‌తిరేక‌త ఉందా లేదా అనేది తేల్చుకోవాలనుకుంటే పార్టీలు ఫిరాయించిన వారి చేత రాజీనామా చేయించి మ‌ళ్ళీ గెల‌వాల‌ని, ద‌మ్ముంటే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి రాజీనామా చేసి గెలిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

ఇప్ప‌టికైనా పిచ్చి కూత‌లు కూయ‌డం మానుకొని, పాల‌మూరు జిల్లాపైన‌, సాగునీటి ప్రాజెక్టుల‌పైన చర్చకు త‌న స‌వాల్‌ను స్వీక‌రించి 21న లోపు స్పందిచంాలని, లేక‌పోతే జూప‌ల్లి పాల‌మూరుకు అన్యాయం చేస్తున్న‌ట్టేన‌ని ఆయ‌న అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios