హరీషన్నా.. దిగజారుడు రాజకీయాలు బంద్ చెయ్

Congress MLA Sampath says harish rao is resorting to cheap politics
Highlights

  • చవటలు, దద్దమ్మల చెప్పుడు మాటలు వినకు
  • డికె అరుణతో ఎలాంటి విభేదాలు లేవు
  • నేను పార్టీ మారనని ఉత్తమ్కు తెలుసు, కేటిఆర్, హరీష్ కు తెలుసు

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఇంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తాడని తాను ఊహించలేదన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంపత్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు లు ఇప్పటి టిఆర్ స్ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కోరుకుంటున్నాను. తోటి శాసనసభ సభ్యుడిగా హరీష్ రావు ని గౌరవ ప్రదంగా కలవడం జరిగింది. కానీ టి ఆర్ స్ ప్రభుత్వం దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నది. ముమ్మాటికీ నేను హరీష్ రావు కి సన్మానం చేసింది వాస్తవమే.. కానీ శతకోటి వందనాలు హరీష్ రావు కి అని అన్ని పేపర్లలో వచ్చింది. హరీష్ రావు కి కుడి పక్కన, ఎడమ పక్కన కూర్చున్న మంత్రులు చవటలు దద్దమ్మలు.. ఆర్ డి ఎస్ పరిరక్షణ నా బాధ్యతగా నా వంతు కృషి చేస్తున్నాను.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడున్న మంత్రులే నాకు సంఘీభావం తెలిపారు. గౌరవ మంత్రి హరీష్ రావు తాజాగా పక్కన ఉన్నటువంటి బడపలు చెప్పిన మాటలు వింటున్నాడు. నేను హరీష్ అన్నా అని గౌరవంగా పిలుస్తే,  నువ్వు కూడా నన్ను తమ్ముడూ అని పిలిస్తావ్,కానీ ఈ రోజు నీ మీద నమ్మకం పోయింది. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం  చేసి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లా మార్చేశారు. నీ పక్కన ఉన్నటువంటి బడపల మాటలు విని బ్రోతల్ కేసులో ఉన్నటువంటి వ్యకి పేరు తీసి నీ విలువను దిగజార్చుకున్నావు హరీష్ అన్నా.

ఇప్పటికైనా హరీష్ రావు దిగజారుడు రాజకీ కీయలు చేయడం మానుకోవాలి. హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. డీకే అరుణ నాకు మాతృసమానురాలు. ఆమెతో నాకు ఎలాంటి రాజకీయ వైరం లేదు. ఆమె వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు చెప్పుడు మాటల విని అభాసుపాలు కావొద్దని చెబుతున్నా. నేను పార్టీ వీడనని  మా ప్రెసిడెంట్ ఉత్తమ్ కు తెలుసు ..టీఆరెస్ లోకి రానని హరీష్ ,కేటీఆర్ లకు తెలుసు.

loader