ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ స్టయిలే వేరు. ఆయన నియోజకవర్గంలో మాట్లాడినా.. అసెంబ్లీలో మాట్లాడినా.. బయట మాట్లాడినా.. కచ్చితంగా పంచ్ డైలాగ్ లతో విమర్శలు గుప్పిస్తారు.

తాజాగా రేవంత్ రెడ్డి, సంపత్ కలిసి గన్ పార్కు వద్ద టిఆర్ఎస్ నేతలతో చర్చలకు రెడీ అంటూ కూసున్నారు. ఈ సందర్భంగా సంపత్ ప్రత్యర్థి టిఆర్ఎస్ నేతలను సినిమా పేర్లతో విమర్శల వర్షం కురిపించారు.

టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ ను ఉద్దేశించి తుంటరి ఎంపి అన్నారు. అలాగే.. బాల్క సుమన్ పక్కన కూసున్న ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాదరావులను చిలిపి ఎమ్మెల్సీలు అని చమత్కరించారు.

ప్రభుత్వం చెబుతున్నవి నిజసమైతే.. సర్కారుకు చర్చించే దమ్ముంటే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు సంపత్. పస లేకనే టిఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు కారుకూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు.

తుంటరి ఎంపీ ,ఇద్దరు చిలిపి ఎమ్మెల్సీ లకు కేసీఆర్ మొట్టికాయలు వేసినందుకే చర్చ కు రావడం లేదా అని నిలదీశారు. సవాల్ విసిరినప్పుడు సుమన్ కు తెలియదా సర్కారు అవినీతి గురించి అని ప్రశ్నించారు. ఎంపి సుమన్ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నన్ను పార్టీ మారతాడని అంటవా? నేనమైనా మారడానికి కేసీఆర్ నా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ అనేది ఒక ముక్కిపోయిన పార్టీ.. మునిగిపోతున్న పార్టీ. ఆ దరిద్రపు పార్టీలోకి ఎవరైనా పోతారా అని ఎద్దేవా చేశారు.