పార్టీ మార్పుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల సమక్షంలోనే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న వెంటే తమ్ముడంటూ .. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆయన శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను అంతం చేయడం కోసమే రాజకీయాల్లో వుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మార్పుకు సంబంధించి మునుగోడు ప్రజల సమక్షంలోనే తీసుకుంటానని కోమటిరెడ్డి వెల్లడించారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం Komatireddy Rajagopal Reddy చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవం ఇవ్వని చోట తాను పార్టీలో ఉండనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన పిలుపునిచ్చారు. KCR ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతానని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు.. Congress పార్టీ గట్టిగా TRS కు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలోకి పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన చెప్పుకొచ్చారు.
స్వార్ధం కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రజల కోసం త్యాగం చేస్తామన్నారు. తాను పార్టీ మారాలనుకొంటే ప్రజలతో చెప్పి మరీ పార్టీ మారుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ పదవుల కు కూడా resign చేస్తానన్నారు. మరో వైపు తాను తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నామని చెప్పామా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ లో అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా పార్టీ లో కొనసాగుతున్న తమను పార్టీకి దూరం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ఇకపోతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంట్రాక్టర్ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సీఎల్పీ.. తనకు సరైన మద్దతు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది
