తాను..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 13ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
తాను..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 13ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల అసెంబ్లీలో జగ్గా రెడ్డి సీఎం కేసీఆర్ తో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్‌ఎస్ నుంచేనని తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై అసెంబ్లీలో తాను అడగ్గానే సానుకూలంగా స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జీవో రాగానే ముఖ్యమంత్రిని కలుస్తానని, పార్టీలకతీతంగా కేసీఆర్‌ను సంగారెడ్డికి ఆహ్వానించి ఘన స్వాగతం పలుకుతానని తెలిపారు.
అనంతరం సీఎల్పీలో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. మెదక్ నుంచి రాహుల్ పోటీ చేస్తే.. కేసీఆర్ నిలబడ్డా రాహులే బంపర్ మెజార్టీతో గెలుస్తారని అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 21, 2019, 10:16 AM IST