45 స్థానాలకు గ్రీన్ సిగ్నల్: అక్టోబర్‌లో జాబితాల విడుదల చేయనున్న కాంగ్రెస్
అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అక్టోబర్ రెండో వారానికి అభ్యర్థులను ప్రకటించేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది
హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ ను ముమ్మరం చేసింది. ఇప్పటికే 70 అసెంబ్లీ స్థానాల్లో వడపోతను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. అక్టోబర్ మొదటి వారంలో 45 మందితో తొలి జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తుంది. రెండో వారంలో మిగిలిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేయనుంది.
ఈ నెల 21, 22 తేదీల్లో న్యూఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. అభ్యర్ధుల ఎంపిక విషయమై చర్చించింది.ఈ నెల మొదటివారంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ హైద్రాబాద్ లో సమావేశమైంది. ఈ సమావేశానికి కొనసాగింపుగా ఈ నెల 21, 22 తేదీల్లో సమావేశం జరిగింది. కాంగ్రెస్ టిక్కెట్ల కోసం వచ్చిన ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీ ముందుంచారు కాంగ్రెస్ నేతలు.
ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్ధుల గెలుపు అవకాశాలపై సునీల్ కనుగోలు సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్ధుల ఎంపికకు ఆ పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నెలలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావించారు. కానీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేయలేదు.దీంతో అక్టోబర్ మొదటి వారంలో కనీసం 45 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తుంది.
ఈ నెల 21,22 న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎలాంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 40 నుండి 45 స్థానాల్లో అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ నేతలు ఒకే చెప్పారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం మరోసారి భేటీ కానున్నారు. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ఉంది. మరో 30 చోట్ల ఇద్దరి పేర్లను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపారు. ఒక్క అభ్యర్ధి పేరున్న స్థానాల్లో ఆ పార్టీ కీలక నేతలు పోటీ చేసే స్థానాలే ఎక్కువగా ఉన్నాయి.
also read:అక్టోబర్ తొలి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా: జాబితాలో చోటు వీరికే...
బలమైన అభ్యర్ధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. మరో వైపు ఇవాళ మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇంకా కూడ ఇతర పార్టీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ , బీజేపీ నేతల నుండి కొందరు కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ నేతల్లో ప్రచారంలో ఉంది. ఆ నేతల చేరిక తర్వాత రెండో జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇతర పార్టీల నేతల చేరికను బట్టి రెండో జాబితా విడుదల ఆధారపడి ఉండే అవకాశం ఉంది.