మధిర: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముదిగొండలో టీఆర్ఎస్ కార్యకర్తలు  డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టి విక్రమార్క పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు.

ముదిగొండలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్ల నుండి ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ నెంబర్లను సేకరిస్తుండగా తాము పట్టుకొన్నామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భట్టి విక్రమార్క  పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు. చట్టప్రకారంగా ఈ ఘటనపై చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.