Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌కు శశి థరూర్.. దూరంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేస్‌లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే శశి థరూర్ ప్రచారం‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

congress leaders away from shashi tharoor election campaign in Telangana
Author
First Published Oct 3, 2022, 12:55 PM IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేస్‌లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే శశి థరూర్ ప్రచారం‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం శశి థరూర్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో తమ మద్దతు మల్లికార్జున ఖర్గే‌కేనని పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేతలు శశి థరూర్ పర్యటనకు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు సీనియర్ నాయకుల్లో ఒక్కరు కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్లలేదు. 

మరోవైపు తాను హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని శశి థరూర్ ఫోన్ ద్వారా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అయితే తమ బంధువు చనిపోవడం వల్ల కలవలేకపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేవంత్‌‌కు ఆయన దగ్గరి బంధువు మృతి పట్ల సానుభూతి తెలిజేస్తున్నట్టుగా ట్వీట్  చేశారు. ‘‘మనం మరోసారి కలుద్దాం’’ అని పేర్కొన్నారు. రేవంత్‌కు, ఆయన బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా తెలిపారు. 

 


ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన శశి థరూర్.. తాను ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పారు.. ఖర్గేతో తాను కలిసి పనిచేశానని గుర్తుచేశారు. మల్లికార్జున ఖర్గేతో తనది స్నేహపూర్వక పోటీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది ఒక కుటుంబంలో జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనే దానిపై ఒక్కొక్కరికి ఒక్కో పంథా అని చెప్పారు. తెలంగాణలో కూడా చాలా మంది నేతలతో తాను మాట్లాడనని చెప్పారు. రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్‌కు వస్తానని తెలిపారు. 

ఇక, ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్ష పదవికి శశి థరూర్ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. మల్లికార్జున ఖర్గే ఎఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు థరూర్ తన నామినేషన్ ను ఉపసంహించుకోవాలని ఆయన కోరారు. ఖర్గే గాంధేయవాది అని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios