ఇది రాజమౌళి RRR కాదు...కేసీఆర్ RRR.. విజయశాంతి ట్వీట్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 11, Feb 2019, 11:32 AM IST
congress leader vijayashanthi tweets on kcr RRR project
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR  సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఇప్పుడు మరో RRR గురించి కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బయటపెట్టారు. 


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR  సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఇప్పుడు మరో RRR గురించి కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బయటపెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.. విజయశాంతి చేసిన ట్వీట్స్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి  రేపుతున్నాయి. 

టాలీవుడ్‌లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌ ‘ఆర్ఆర్ఆర్’ (రీజనల్ రింగ్ రోడ్)తో పోలుస్తూ రాములమ్మ వరుస ట్వీట్స్‌ చేశారు.

‘‘ రాజమౌళి దర్శకత్వం వహించే RRR చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త RRR ప్రాజెక్టుకి శ్రీకారం చేట్టారని వార్తలు వస్తున్నాయి.  ఇంతకీ కేసీఆర్ గారి RRR ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ‘‘ ఈ RRRకు తెలంగాణ కేబీనెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి లింక్ ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదు మరి’’ అని పేర్కొన్నారు.

ఆ ట్వీట్ కి కొనసాగింపుగా ‘‘ సీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే... తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి. దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ... ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం"  అంటూ.. విజయశాంతి చేసిన ట్వీట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

 

loader