హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమదే గెలుపు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సోషల్ మీడియా వేదికగా విజయశాంతి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడ కేసీఆర్ ఇదే రకమైన ప్రకటన చేశారని ఆమె గుర్తు చేశారు.

జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే...

దీనిలో Vijayashanthi పోస్ట్ చేసారు 12, నవంబర్ 2020, గురువారం

దుబ్బాకలో తమదే గెలుపు అని.. మెజారిటీ ఎంతో అని తాము ఎదురుచూస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనను ఆమె గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ వి అవకతవకల సర్వేలని ఆమె చెప్పారు.

జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఆమె ప్రస్తావించారు. సానుభూతి తప్ప దుబ్బాక ఫలితం మరొకటి కాదంటున్న సీఎం... ఆ సానుభూతి టీఆర్ఎస్ కు ఎందుకు లభించలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు.ఈ మేరకు ఫేస్ బుక్ లో విజయశాంతి పోస్టు చేశారు.