Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్ కౌంటర్... విజయశాంతి రెస్పాన్స్ ఇదే

ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా... ఘోరమైన నేరం చేసిన నలుగురికి తగిన శిక్ష పడిందనేది తన అభిప్రాయం అని స్పష్టం చేశారు. మానవత్వాన్ని మంటగలిపిన నలుగురి విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదేమోనన్నారు

Congress Leader Vijayashanthi Response on Disha Case Accused Encounter
Author
Hyderabad, First Published Dec 7, 2019, 8:05 AM IST

దిశ నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులు.... దిశకు సంబంధించిన కొన్నివస్తువులను సేకరించేందుకు నిందితులను  ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లగా.... అక్కడ నిందితులు పారిపోవాలని చూశారు. దీంతో పోలీసులు వాళ్లని ఎన్ కౌంటర్ చేశారు. కాగా...ఈ ఘటనపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు.

చాలా మంది నిందితులను ఎన్ కౌంటర్ చేయడం కరెక్టేనని అభిప్రాయపడుతుండగా... మరికొందరు మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. ఈ వాదనలపై కూడా విజయశాంతి స్పందించారు. ఫేస్ బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

AlsoRead అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!...

ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా... ఘోరమైన నేరం చేసిన నలుగురికి తగిన శిక్ష పడిందనేది తన అభిప్రాయం అని స్పష్టం చేశారు. మానవత్వాన్ని మంటగలిపిన నలుగురి విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదేమోనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు జరగడానికి ఆస్కారం లేని విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. 

ఈ విషయాన్ని గుర్తించి మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలు డిమాండ్ కూడా ఇదేనన్నారు. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై రాములమ్మ సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios