హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్త నేతృత్వంలో విజయశాంతి జన్మదిన వేడుకలు జరిగాయి. మహిళా కార్యకర్తల సమక్షంలో విజయశాంతి కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలకు రాములమ్మ ధన్యవాదాలు తెలిపారు. "