Asianet News TeluguAsianet News Telugu

రాములమ్మ అలిగారట ఎందుకంటే..

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. అయితే అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాములమ్మ మాత్రం కానరావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాములమ్మ ఇంత రాజకీయ వేడిలో కూడా బయటకు గాంధీభవనన్ మెట్లెక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 
 

congress leader vijayasanthi silent in present political situation
Author
Hyderabad, First Published Sep 10, 2018, 8:07 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. అయితే అభిమానులు ముద్దుగా పిలుచుకునే రాములమ్మ మాత్రం కానరావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాములమ్మ ఇంత రాజకీయ వేడిలో కూడా బయటకు గాంధీభవనన్ మెట్లెక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విజయశాంతి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నాలుగున్నరేళ్లుగా పొలిటికల్ స్క్రీన్ పై కనీసం దర్శనం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజులుపాటు పర్యటించినా బయటకు రాలేదు. 

అయితే చాలా రోజుల తర్వాత ఇటీవల బోనాల పండుగకు రాములమ్మ ప్రజలకు కనిపించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. దీంతో రాజకీయాల్లో ఇక రాములమ్మ జోరు పెంచనున్నారని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయంలో తనదైన పాత్ర పోషిస్తారని అంతా గుసగుసలాడుకున్నారు. అంతే బోనం సమర్పించి వెళ్లిపోయిన రాములమ్మ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  

కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రాహుల్ గాంధీ పర్యటనలో పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే మారింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం రాములమ్మ వ్యూహం ఏంటా అని తలలు పట్టుకున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ జోరందుకోవడంతో ఇప్పటికైనా విజయశాంతి ఎన్నికల సమరంలో పాల్గొంటుందని భావించారు. 

అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవాలని అస్త్రసస్త్రాలను ప్రయోగిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడంతో ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.  

ఈ ఎన్నికలే గెలుపో చావో అన్న చందంగా పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. సినీ గ్లామర్ ఒకవైపు...వాగ్ధాటి అయిన విజయశాంతి ఎన్నికల స్క్రీన్ పై మెరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కలిసి వస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే రాములమ్మ మాత్రం తన పంతం వీడటం లేదు..అజ్ఞాతం నుంచి బయటకు రావడం లేదు. 

రాములమ్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అందువల్లే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం లేదని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతికి ఎలాంటి పదవి ఇవ్వలేదని అందువల్లే అలకబూనిందని సమాచారం. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కోరినా అధిష్టానం స్పందించలేదని కనీసం పీసీసీ తెలంగాణ కమిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదని దీంతో రాములమ్మ హర్ట్ అయ్యారని టాక్.  

Follow Us:
Download App:
  • android
  • ios