టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌‌పర్సన్ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మొత్తం మైనార్టీలు టీఆర్ఎస్- ఎంఐఎంలు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న.. ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఓట్ల కోసమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. 

మరోవైపు విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఏ రోజు అనేదే తేలాల్సి ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే మూడుసార్లు ఆమెతో చర్చలు జరిపింది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండుసార్లు సమావేశమయ్యారు.

ఈ మూడు సందర్భాల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ చేస్తున్న పోరాటాలను రాములమ్మ ప్రశంసించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలపై సంజయ్‌ దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, ఆమె కూడా ఇదే పంథా కోరుకుంటున్నట్లు తెలిసింది