జగన్ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదు.. కాంగ్రెస్ నేత వీహెచ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను టీడీపీతో పాటు పలు రాజకీయ పక్షాలు ఖండిస్తున్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖండిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన జగన్ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదలు పెట్టిన రాజకీయాలను జగన్ అమలు చేస్తున్నారని విమర్శించారు.
గతంలో ప్రతీకార రాజకీయాలు లేవని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టలేదని అన్నారు. జగన్ వచ్చాకనే రాజకీయాలు భ్రష్టు పట్టాయని ఆరోపించారు.
ఇదిలాఉంటే, చంద్రబాబు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కక్ష సాధింపులా కనిపిస్తుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం సరికాదు. తప్పు జరిగితే విచారణ జరిపించాలని.. ప్రతీకారంతో ఎవరినీ ఏమీ చేయకూడదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు సమర్థనీయం కాదని పేర్కొన్నారు.