ఒకే రోజున సీఎల్పీ సమావేశం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు.

 హైదరాబాద్: ఒకవైపు సీఎల్పీ సమావేశం, మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టూర్ నిర్వహించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు.

హైద్రాబాద్ లో CLP సమావేశం జరిగింది.ఈ సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు DCC అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశంలో Sampath kumar కీలక అంశాలను లేవనెత్తారు. Hyderabad లో సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు, మరో వైపు Medak లో Revanth Reddy టూర్ నిర్వహించారని ఆయన చెప్పారు. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు నిర్వహించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎల్పీ సమావేశానికి వచ్చిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy ఎందుకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో మన పార్టీ స్టాండ్ ఏమిటని సంపత్ కుమార్ ప్రశ్నించారు. Assembly లో మైక్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలని కూడా ఆయన అడిగారు.

Telangana Assembly Budget Session ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సీఎల్పీ చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన జగ్గారెడ్డి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టూర్ గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే తొలుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని గవర్నర్ Tamilisai Soundararajan వివరించారు.

కొంత కాలంగా గవర్నర్ సౌందర రాజన్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది. గవర్నర్ కు మంత్రులు ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశాల తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కానీ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతో ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఈ సమయంలో గవర్నర్ ప్రసంగం నిర్వహిస్తే రాజ్యాంగం ప్రకారంగా అది తప్పేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.

మరో వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ మేరకు శనివారం నాడు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలుత తన ప్రసంగం ఉంటుందని ప్రకటించారని ఆ ప్రకటనలో ఆమె గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని ప్రభుత్వం వివరించిందన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన వివరించింది. 

కొంత కాలంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కి కేసీఆర్ సర్కార్ కి అగాధం పెరుగుతుందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి తగినట్టుగానే ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో సీఎం సహా మంత్రులు హాజరు కాలేదు. మేడారంలో గవర్నర్ వచ్చిన సమయంలో కూడా మంత్రులు గవర్నర్ కు స్వాగతం పలకలేదు. మేడారానికి గవర్నర్ వెళ్లే సమయంలో హెలికాప్టర్ కావాలని కోరినా కూడా ప్రభుత్వం నుండి స్పందన రాలేదని ప్రచారం సాగుతుంది. దీంతో గవర్నర్ రోడ్డు మార్గంలోనే మేడారానికి వెళ్లారు.