డీఎస్ కు జరిగిన అవమానం పై దానం నాగేందర్ మాట్లాడాలి : రేవంత్ రెడ్డి

congress leader revanth reddy responds on d srinivas issue
Highlights

వారసుల కోసమే ఆ నాయకుల ఆరాటం...  

నిజామాబాద్ టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి స్పందించారు. డీఎస్ కు వ్యతిరేకంగా జిల్లా నాయకులంతా ఏకమవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తనకు ఒకటి అర్థమవుతోందని అన్నారు. ఇక్కడ తమ వారసులను కాపాడుకోడానికే తండ్రులు ఆరాటపడుతున్నారని రేవంత్ చమత్కరించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవాళ కవిత ఇంట్లో సమావేశమైన విషయం తెలిసిందే. వారంతా కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న డీఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఓ లేఖ ను కేసీఆర్ కు రాశారు.  ఇలా ప్రస్తుతం నిజామాబాద్ టీఆర్ఎస్ వ్యవహారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ కూడా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీలో బిసిలకు అన్యాయం జరిగుతోందని, టీఆర్ఎస్ లో ఆ వర్గానికి తగిన గౌరవం లభిస్తుందని అన్న దానం నాగేందర్ మాటలను ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. తాజాగా బిసి నేత డి. శ్రీనివాస్ ను అవమానించేలా జరుగుతున్న పరిణామాలపై దానం మాట్లాడాలని ఆయన అన్నారు. ఓ బిసి నేతకు టీఆర్ఎస్ లో ఎలాంటి అవమానం జరుగుతుందో దానం గుర్తించాలని రేవంత్ సూచించారు.

ఇక నిజామాబాద్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసమే జరుగుతున్నాయని రేవంత్ అన్నారు. ఏంపిగా వున్న కవిత కోసం కేసీఆర్ తాపత్రయ పడుతుంటే, కొడుకుల కోసం డీఎస్ ఆరాట పడుతున్నారని అన్నారు. ఈ ఆరాటమే ప్రస్తుత పరిణామలకు దారి తీశాయని రేవంత్ పేర్కొన్నారు.

loader