''త్వరలో సిద్దిపేటకు ఉపఎన్నిక, హరీష్ సతీమణి పోటీ''

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 11, Feb 2019, 12:23 PM IST
congress leader ramya rao interesting post on whats app group over harish rao
Highlights

నాలుగు మాసాల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్.రమ్యారావు వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్ట్  సంచలనంగా మారింది


సిద్దిపేట: నాలుగు మాసాల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్.రమ్యారావు వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్ట్  సంచలనంగా మారింది.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన  ఎన్నికల్లో సిద్దిపేట నుండి హరీష్ రావు  లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే  హరీష్ రావు సతీమణి శ్రీనిత ఈ స్థానం నుండి పోటీ చేస్తారని ఆమె ఈ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టారు.

తాజా తెలంగాణ పేరుతో కేసీఆర్ అన్న కూతురు. టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్యారావు తమ  పార్టీకి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ఈ  పోస్ట్ పెట్టారు.రమ్యారావు, హరీష్‌రావులు సమీప బంధువులు. 

అయితే ఈ పోస్ట్‌కు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.  పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్‌రావును కేసీఆర్  పోటీ చేయిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.  ఈ తరుణంలోనే రమ్యారావు చేసిన పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

loader