టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రావు. 150 డివిజన్లలో ప్రభుత్వ ఆస్తులపై టీఆర్ఎస్ హోర్డింగులు పెట్టారని అయినప్పటికీ ఈసీ పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

ఎన్నికల కమీషనర్ గౌరవాన్ని కాపాడుకోవాలని పొన్నం కోరారు. ప్రభుత్వ ఆస్తులపై వున్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఫ్లెక్సీలను తొలగించకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తొలగిస్తారని పొన్న ప్రభాకర్ హెచ్చరించారు. 

మరోవైపు ఎన్నికల కమిషన్... జీహెచ్ఎంసీ కమిషనర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మెట్రో పిల్లర్ల కు టీఆర్ఎస్ కటౌట్ లు పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఎన్నికల కమిషన్ సిగ్గుపడాలన్న ఆయన ఎల్ఈడీ వ్యాన్స్ అడిగితే మాకు అనుమతి లేదు అన్నారని అదే కేటీఆర్ కి మాత్రమే అనుమతి ఇచ్చారని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్.. కేటీఆర్ కి హైదరాబాద్ రాసిచ్చాడని ఉత్తమ్ ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్...ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.