కాంగ్రెస్కు షాకివ్వనున్న రామ్మోహన్ గౌడ్: కాసేపట్లో హస్తం నేత ఇంటికి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీనేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎల్ బీ నగర్ కాంగ్రెస్ టిక్కెట్టును రామ్మోహన్ గౌడ్ ఆశించారు. టిక్కెట్టు దక్కని కారణంగా రామ్మోహన్ గౌడ్ అసంతృప్తితో ఉన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎల్‌బీనగర్ అసెంబ్లీ టిక్కెట్టును రామ్మోహన్ గౌడ్ ఆశించారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మధు యాష్కీకి టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తితో ఉన్న రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీనే రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ టిక్కెట్టు రామ్మోహన్ గౌడ్ కు దక్కలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు.ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆర్. కృష్ణయ్య చేతిలో ఎం. రామ్మోహన్ గౌడ్ ఓటమి పాలయ్యారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎల్ బీ నగర్ నుండి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ దఫా కూడ సుధీర్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. దీంతో బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కదని భావించిన రామ్మోహన్ గౌడ్ అక్టోబర్ 12న కాంగ్రె్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్టు కూడ దక్కకపోవడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
also read:పాలమూరులో 14 సీట్లు గెలవాలి: నాగం మంచి స్నేహితుడన్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆ పార్టీ చూస్తుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకుంటుంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో టిక్కెట్టు దక్కని నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు నిన్ననే బీఆర్ఎస్ లో చేరారు.ఇవాళ రామ్మోహన్ గౌడ్ ను కూడ బీఆర్ఎస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో చర్చలు జరిపి పార్టీలో చేర్చుకొనే ప్రక్రియను మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బీఆర్ఎస్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తుంది.