హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క. కాంగ్రెస్ పార్టీ,  టీఆర్ఎస్ పార్టీ రెండూ కలిసే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. 

టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు  కలిసే ఉన్నాయంటూ ఆరోపించారు భట్టి విక్రమార్క. లోక్ సభలో బీజేపీ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు టీఆర్ఎస్ తన మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఈ పరిణామాలు చూస్తుంటే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు అంతా తెలుసునని ఎవరు ఏ పార్టీతో కలిసి ఉన్నారో తమ కంటే వారికే బాగా తెలుసునంటూ చెప్పుకొచ్చారు.