టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. తెలంగాణ రాకపోయుంటే నీ గతేంటీ అంటూ ఫైరయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని మధుయాష్కీ ఎద్దేవా చేశారు
తెలంగాణ వచ్చాక.. రాకముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులెంత అని ప్రశ్నించారు టీపీసీసీ (tpcc) ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ (madhu yashki goud) . మేలో రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) తదితరులతో కలిసి ఆయన గురువారం వరంగల్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ (kakatiya university) కూడా కీలకపాత్ర పోషించిందని మధుయాష్కీ అన్నారు. తెలంగాణ వచ్చాక యువతకు ఉద్యోగాలు రాలేదని.. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో టీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని మధుయాష్కీ ఆరోపించారు.
అమెరికాలో అంట్లు తోముతూ బతికిన కేటీఆర్ (ktr) గతి.. తెలంగాణ రాకపోయుంటే ఎలా వుండేదని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్ చూసి వస్తూ తనతో పాటు ఫ్లైట్‌లో ప్రయాణించిన రోజు.. ఏదైనా వ్యవహారం వుంటే చెప్పమని తనని కేటీఆర్ అడిగారని మధుయాష్కీ గుర్తుచేశారు. తెలంగాణ గడిని ఎట్లా కొల్లగొట్టాలని కేసీఆర్ పక్కా ప్లాన్ గీశాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ నినాదంతో ముందుకు వచ్చి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మధుయాష్కీ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ దొరతనం , గడీల పాలన చూపిస్తున్నారని.. తెలంగాణ వచ్చిరాగానే వరంగల్ జిల్లాలో నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయించారని ఆయన వ్యాఖ్యానించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలుపై రాజకీయం చేస్తున్నారని మధుయాష్కీ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఆయన ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) మాట్లాడుతూ.. పోరాటాలకు వరంగల్ మారుపేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని సమస్యల్లో ముందుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్ నేతలు లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. రైతు, ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు.
మరోవైపు.. మంత్రి కేటీఆర్ (ktr) విసిరిన రాజీనామా సవాల్‌పై స్పందించారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . రాజీనామా చేసిన వెంటనే ఎన్నికల కలెక్షన్ గురించి మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ (trs) రాజీనామాలు త్యాగం కాదని.. తెలంగాణకు ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో తాను ఎక్కడున్నానని అడుగుతున్నారని.. అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని కౌంటరిచ్చారు. వరంగల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.
ప్రజలు ఆనాడు తిరుగుబాటు బావుటా ఎగరేశారు కాబట్టే తెలంగాణ రాచరికం నుంచి విడుదలైందన్నారు టీపీసీసీ చీఫ్ . రాహుల్ గాంధీ (rahul gandhi) సూచన మేరకు, సోనియా గాంధీ ఆదేశాల మేరకు వరంగల్ నడిబొడ్డున సభ పెట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదని రేవంత్ చెప్పారు. చెరకు ఫ్యాక్టరీలు మూసివేయడం వల్లే నిజామాబాద్‌లో రైతులు వరివేస్తున్నారని ఆయన తెలిపారు. రైతులకు వరి తప్ప వేరే పంట వేయలేని పరిస్ధితులు కల్పించారని రేవంత్ ఆరోపించారు.
