కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
తనను చంపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి నల్లగొండ పట్టణంలోని 13వ వార్డు పరిధిలో గల పెద్దబండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికలతో మన బతుకులు మనమే మార్చుకోవాలని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముందు తన అనుచరులను హత్య చేసి.. అనంతరం తనను చంపాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
