హైదరాబాద్: ప్రజాతీర్పును గౌరవించడంతో స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి జానారెడ్డి చెప్పారు.నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత   ఆదివారం నాడు హైద్రాబాద్  గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనను ఆశీర్వదించిన ఓటర్లకు శిరస్సువహించి నమస్కరిస్తున్నట్టుగా చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా ఆయన చెప్పారు. 

also read:జానారెడ్డి : మూడు దఫాలు ఆ సామాజికవర్గం చేతిలో ఓటమి

కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కల్గించేందుకుగాను  తాను పోటీ చేశానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను పోటీ చేసినట్టుగా ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన చెప్పారు. తన మాట మేరకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో  పోటీ చేసినట్టుగా ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

తాను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కర్తవ్యాన్ని నిర్వహించానని, ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన చెప్పారు. రాజకీయ విమర్శలు చేయబోనని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలు రావాలని ఆయన అన్నారు. తన ఆశయాలు ప్రజలకు అందితే చాలునని ఆయన చెప్పారు. పార్టీకి సలహాలూ సూచనలూ ఇస్తానని జానారెడ్డి చెప్పారు.

ఒక్క సీటుతో ప్రభుత్వాన్ని శాసించడం గానీ ప్రభుత్వాన్ని పడగొట్టడం గానీ సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రజల్లో చైతన్యం నింపడానికి ఇటువంటి ఎన్నికలు పనికి వస్తాయని ఆయన అన్నారు