తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డికి నిరసన సెగ తప్పడం లేదు. ఆయన పీఫుల్స్ ప్రంట్ తరపున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అయితే గతంలో ఓ గ్రామంలో ప్రచారం కోసం వెళ్ళి ఆయన్ని అక్కడి ప్రజలు తమ సమస్యలపై నిలదీశారు. దీంతో ఎప్పుడూ శాంతంగా వుండే జానారెడ్డి వారిపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జానాకు అలాంటి నిరసనే మరో గ్రామంలో ఎదురయ్యింది. 

నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణ పురానికి ప్రచారం నిమిత్తం జానారెడ్డి వెళ్లగా ఓ  వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. తమ గ్రామానికి నీళ్లివ్వకుండా ఇక్కడ ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారంటూ జానాను ప్రశ్నించాడు. దీంతో జానా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులే తన ప్రచారానికి అడ్డంకులు సృష్టించాలని  ఇలాంటి వారిని రెచ్చగొడుతున్నారని జానా మండిపడ్డారు.

ఈ సందర్భంగా జానారెడ్డి ఆగ్రహంగా కాంగ్రెస్ హయాంలో ఆ గ్రామంలో ఏమేం అభివృద్ది పనును చేసింది ఏకరువు పెట్టారు. ఇక్కడి పాఠశాల భవనం కట్టించింది, సీసీ రోడ్లు వేయించింది, విద్యుత్ సదుపాయం కల్పించింది కాంగ్రెస్ హయాంలోనే అని జానా వివరించారు. 

వారం రోజుల క్రితం నాగార్జునపేట గ్రామంలో కూడా కొందరు ఇలాగే జానా ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న ఎన్నికల ప్రచార వాహనాన్ని అడ్డుకుని మరీ నిరసన తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు పలు సమస్యలపై ఆయన్ను నిలదీయగా వారిపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  మరోసారి అలాంటి నిరసనే జానాకు ఎదురయ్యింది. 

మరిన్ని వార్తలు

జానారెడ్డికి చేదు అనుభవం... ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు (వీడియో)