షోకాజ్‌కి కోమటిరెడ్డి రిప్లై తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం: జైరాం రమేష్

పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్  పై రిప్లై ఇచ్చిన తర్వాత  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డిపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాజీ  కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పారు.

Congress Leader Jairam Ramesh Reacts On Komatireddy Venkat Reddy  showcause  notice  Issue

హైదరాబాద్:  పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రిప్లై  ఇచ్చిన తర్వాత  పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని  కాంగ్రెస్  పార్టీ అగ్రనేత   జైరాం రమేష్  చెప్పారు.

రాహుల్  గాంధీ నిర్వహిస్తున్న  భారత్ జోడో యాత్ర మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతుంది.గురువారం నాడు మక్తల్ నియోజకవర్గంలో  జైరాం  రమేష్  మాట్లాడారు.పార్టీలు చూడకుండా  ఈ దఫా తన  సోదరుడు  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి  ఓటేయాలని  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి తన అనుచరులకు  ఫోన్  చేసినట్టుగా  ఉన్న  ఆడియో కాంగ్రెస్ లో కలకలం రేపింది. అస్ట్రేలియా టూర్  లో  కూడ  మునుగోడులో  కాంగ్రెస్ గెలవదని  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై   పార్టీ అధినాయకత్వం  షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ  ఇవ్వాలని ఆదేశించిన విషయం  తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై  జైరాం ఇవాళ స్పందించారు.

తెలంగాణలో  కొత్త  నినాదం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ లోటస్ చోడో , భారత్  జోడో చేపట్టాలని ఆయన  కోరారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలసీలు దేశాన్ని  విచ్ఛిన్నం చేస్తున్నాయన్నారు. మోడీ  విధానాలతో దేశంలో  ఆర్ధిక అసమానతలు  పెరిగిపోయాయని  ఆయన  ఆందోళన వ్యక్తం  చేశారు.. బీజేపీ విధానాలతో దేశం మరింత  పేదరికంలోకి వెళ్లిందన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 8న  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ  రాజీనామా  చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. తనపై రేవంత్ రెడ్డి,అద్దంకి దయాకర్ చేసిన విమర్శ:లకు ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి ప్రకటించారు. 

also read:తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర.. మూడు రోజుల విరామం తర్వాత పున:ప్రారంభం

తెలంగాణలో భారత్  జోడో యాత్ర గురువారం నాటికి రెండో  రోజుకి చేరుకుంది.  నిన్న  సాయంత్రం  ఢిల్లీ నుండి  మక్తల్ కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఇవాళ  ఉదయం నుండి మూడు రోజుల విరామం తర్వాత  రాహుల్ గాంధీ యాత్రను పున: ప్రారంభించారు.రాష్ట్రంలో సుమారు 15 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర సాగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios