టీఆర్ఎస్‌కు బీఆర్ఎస్ కాదు.. వీఆర్ఎస్ ఇవ్వాలి : కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై జైరాం రమేశ్ సెటైర్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటనపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. టీఆర్ఎస్- బీజేపీలు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే ఒకటి బీజేపీ, రెండోది టీఆర్ఎస్‌‌ అని జైరాం రమేశ్ ఆరోపించారు. 

congress leader jairam ramesh comments on kcr's new national political party

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ ఆర్ఎస్ఎస్ మీద పడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ ముఖ్యనేతలతో మంగళవారం దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిగ్గీ రాజా మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ జోడో గురించే చర్చ జరుగుతోందన్నారు. పెద్దవాళ్లకే బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తోందని దిగ్విజయ్ ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేవని దిగ్విజయ్ సింగ్ అన్నారు. పార్టీ పేరు మారిస్తే ఏదో జరిగిపోదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంతకుముందు .. బీజేపీ , టీఆర్ఎస్‌లు నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివన్నారు జైరాం రమేశ్. టీఆర్ఎస్‌కు బీఆర్ఎస్ సమయం కాదని.. వీఆర్ఎస్ ఇవ్వాలంటూ ఆయన సెటైర్లు వేశారు. టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని.. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే ఒకటి బీజేపీ, రెండోది టీఆర్ఎస్‌‌ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే... దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో.. రాహుల్ యాత్ర తెలంగాణలోనే కొనసాగనుంది. దీంతో రాహుల్ యాత్ర మునుగోడులో కాంగ్రెస్‌‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

ALso REad:కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన : మందు, కోళ్లు పంచిన టీఆర్ఎస్ నేత.. వీడియో వైరల్

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 150 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ యాత్రతో కాంగ్రెస్ కొత్త జోష్ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్‌కు బూస్ట్ ఇస్తుందని వాదన వినిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్, మద్దతుదారులు, పార్టీ ఐడియాలజీని అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. అలాగే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌పై జనాల్లో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే కాంగ్రెస్‌ నేతల మధ్య సమన్వయ లోపం, పార్టీకి సరైన దిశా నిర్దేశనం లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. 

దీంతో దక్షిణాదిలో ఆ పార్టీ పరిస్థితి.. చుక్కాని లేని నావగా మారిందనే చెప్పాలి. అయితే రాహుల్ పాదయాత్ర దక్షిణాదిలో పార్టీ పరిస్థితిని మారుస్తుందనే అభిప్రాయం వ్యక్తం వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు రాహుల్ యాత్రకు వస్తున్న స్పందన కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు రాహుల్ యాత్రను ఏ మేరకు బూస్ట్ ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. దీంతో రాహుల్ యాత్ర.. మునుగోడులో కాంగ్రెస్‌కు లబ్దిచేకూరుస్తుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios