ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఎన్డీయే మిత్ర పక్షం నుంచి వైదొలగడానికి కారణం ఇదే అంటూ.. కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. విజయశాంతి చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇటీవల ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ... వచ్చే లోక్ సభ ఎన్నికలు మోదీకి, ప్రతిపక్షాలకు మధ్య జరగుతున్నాయని ప్రకటించారు. మిత్రపక్షాలైన ఎన్డీయే కూటమి అవసరం లేకుండానే మోదీ నేతృత్వంలోని బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. అమిత్ షా వ్యాఖ్యలపై విజయశాంతి మండిపడ్డారు.

ఇలా ఒక్క వ్యక్తి చుట్టూ బీజేపీ ని తిప్పడం వల్లే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దూరమైపోయారని విజయశాంతి పేర్కొన్నారు. మోదీ ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక ఎన్డీయే నుంచి  చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వైదొలిగిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇంత జరిగినా..అమిత్ షా మిత్రపక్షాలను లెక్కచేయని విధంగా మోదీ స్థుతి పాడటం వారి నిరంకుశత్వానికి అద్ధం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మిత్రపక్షం శివసేన ఎలా స్పందిస్తోందో చూడాలి అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.