వరంగల్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు, ఇల్లంద ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ బందెల నాగార్జున అనుమానాస్పద స్థితిలో మరణించారు. వర్థన్నపేట పట్టణానికి చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు
వరంగల్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు, ఇల్లంద ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ బందెల నాగార్జున అనుమానాస్పద స్థితిలో మరణించారు. వర్థన్నపేట పట్టణానికి చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు.
దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆయన ఫోన్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో గాలించారు.. అయినా ఆచూకీ దొరకకపోవడం.. మరోసారి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో వర్థన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు వర్థన్నపేట ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో నాగార్జున ఆకేరు వాగు బ్రిడ్జి దాటినట్లు ఉండగా.. పక్క గ్రామమైన ఇల్లందలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే అక్కడికి రానట్లుగా తేలింది. అనంతరం ఆయన వర్థన్నపేటకు వచ్చినట్లుగా గుర్తించారు.
వెంటనే బ్రిడ్జి పక్కనే ఉన్న పొదల్లో గాలించగా నాగార్జున మృతదేహం లభించింది. మృతుడి ఒంటిపై పాయింట్, డ్రాయర్ పక్కన పడి వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
