మంత్రి ఈటల రాజేందర్ కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలని కానీ, అంతకంటే ముందు టిఆర్ఎస్ పార్టీలో శిక్ష పడాల్సిన వారు చాలామందే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. కాకపోతే కేసీఆర్ తన పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఈటెలను బలిపశువును చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈటెల ను తప్పించాలనేది కేసీఆర్ పన్నాగం అని ఆరోపించారు. అలాగే భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ పై ఇప్పటి దాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మల్లారెడ్డి తోపాటు కేటీఆర్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినపుడు ఎందుకు విచారణ జరిపించి లేదని ప్రశ్నించారు.

కబ్జాలు నిజమే, నేడే నివేదిక: ఈటెలపై ఆరోపణల మీద మెదక్ కలెక్టర్...

ప్రభుత్వ వ్యతిరేక వర్గం పై ఆరోపణలు వస్తే విచారణకు ఆదేశించడం అనుకూల వర్గాన్ని వదిలేయడం కాకుండా మంత్రి ఈటల రాజేందర్ కోరినట్లు అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న కనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు