తెలంగాణలోని అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు ముఖ్యమైన పార్టీలు పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక నాయకులు కూడా తమ పార్టీ గెలుపుకు దోహదపడే ఏ అవకాశాన్ని వదలడం లేదు.

తాజాగా అలాంటి భేటీ ఒకటి కాంగ్రెస్ ప్రచార సారథి భట్టి విక్రమార్క ఇంట్లో జరిగింది. ప్రజా యుద్దనౌక, గాయకుడు గద్దర్ భట్టితో సమావేశమవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భట్టి విక్రమార్క ఇంట్లో ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశం అనంతరం భట్టి మాట్లాడుతూ...పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ కోసం కవులు, కళాకారులు తమతో కలిసిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ విషయంపై చర్చించేందుకే గద్దర్ తో సమావేశమైనట్లు భట్టి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరి సహాయం కోరుతున్నామని అన్నారు.
ఏ ఆశయాలతో అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ నాలుగున్నరేళ్లలో అవేవీ నెరవేరలేదని విమర్శించారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం లోనైనా అవన్నీ నెరవేరాలంటే తమతో కలిసి రావాల్సిందిగా కవులు, మేధావులతో పాటు ప్రజలను కోరుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.