అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం తనకు అవకాశమిస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమని ప్రకటించారు.  

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశమిస్తే.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటనలో ఉన్నారు. లింగంపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాట సమయంలో అజహరుద్దీన్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అజహరుద్దీన్ అందులో తన తప్పు లేదని అన్నారు. జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేసుకోవచ్చని హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పారు. జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటలో తమ తప్పు లేదన్నారు. . తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని అజహరుద్దీన్ ప్రశ్నించారు. ఆ తొక్కిసలాట దురదృష్టకరం పేర్కొన్నారు.