తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై అనుసరించాల్సిన వ్యూహంపై  కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్ సోమవారం నాడు న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్ సోమవారం నాడు న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు.

మరికొద్దిగంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలో అనుసరించిన ప్లాన్‌ను తెలంగాణలో కూడ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఈ తరుణంలో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ ఏర్పాటు విషయమై 14 పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.ఈ సమావేశంలో చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మాద్ పటేల్ సమావేశమయ్యారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ అహ్మద్ పటేల్ బాబుతో చర్చించారు. కనీస మెజారిటీకి దూరంలో కూటమి నిలిచిపోతే ఏ విధమైన వ్యూహన్ని అనుసరించాల్సిన వ్యూహంపై బాబుతో అహ్మాద్ పటేల్ చర్చించారు. 

బాబు సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తమ వ్యూహన్ని అమలు చేయనుంది.అహ్మద్ పటేల్ కూడ హైద్రాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యూహన్ని అమలు చేయనున్నారు