హైదరాబాద్: తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రాములమ్మ విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెసు అధిష్టానం రంగంలోకి దిగింది. విజయశాంతి చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్నప్పటికీ ఆమె కిమ్మనడం లేదు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తును ఆమె వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని కూడా వార్తాకథనాలు వస్తున్నాయి. ఆ వార్తాకథనాలపై కూడా ఆమె స్పందించడం లేదు 

ఈ స్థితిలో ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం తరఫున బోసు రాజు, శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. వారిద్దరు విజయశాంతితో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయశాంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి వాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టాం ఉన్నట్లు తెలుస్తోంది.