Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మీద ఫైట్: కాంగ్రెసు మహా కూటమి కుదిరేనా...

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఓ వైపు తెలుగుదేశం పార్టీ, మరో వైపు కోదండరామ్ తెలంగాణ జన సమితి చెబుతున్నాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి మహా కూటమి కట్టక తప్పదనే భావనతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. 

Congress grand alliance efforts
Author
Hyderabad, First Published Sep 1, 2018, 12:16 PM IST

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఓ వైపు తెలుగుదేశం పార్టీ, మరో వైపు కోదండరామ్ తెలంగాణ జన సమితి చెబుతున్నాయి. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి మహా కూటమి కట్టక తప్పదనే భావనతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. 

ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహా కూటమిలోకి సిపిఐతో పాటు కోదండరామ్ నాయకత్వంలోని టిజెఎస్, చెరుకు సుధాకర్ నేతృత్వంలోని ఇంటి పార్టీ కూడా వస్తాయని అంటున్నారు. 

సిపిఎం మాత్రం కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. తెలుగుదేశం, జనసేనలతో మాత్రం సై అంటోంది. దాంతో మహా కూటమిలో జనసేన, సిపిఎం ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెసులో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కేసిఆర్ ను ఎదుర్కోవడానికి అది తప్పదనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. 

సిపిఎం కారణంగా ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదనే కాంగ్రెసు ఉద్దేశ్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయడానికి సిద్దపడుతోంది. మరో వైపు బిజెపి ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios